కూటమి మీటింగ్ ‘ రెడీ?

7
- Advertisement -

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి నిత్యం ఏదో ఒక అంశంపై తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కూటమి ఏర్పాటు జరిగి ఇప్పటికే చాలా రోజులైనప్పటికి.. ఇంకా ఎవరికి వారే అన్నట్లుగా కూటమిలోని అగ్రనేతలు వ్యవహరిస్తుండడంతో కూటమిలో చీలిక రావడం ఖాయమనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు కూటమి తరుపున పి‌ఎం అభ్యర్థిపై క్లారిటీ లేకపోవడం, ఆధిపత్యం కోసం అంతర్గత కుమ్ములాటలు జరుగుతుండడంతో ఇంతకీ ఇండియా కూటమి ఎన్నికల వరకైనా నిలుస్తుందా లేదా కూలిపోతుందా అని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు. ఇలా తీవ్ర కన్ఫ్యూజన్ నడుమ ఇప్పటివరకు మూడు సార్లు ఇండియా కూటమి అగ్రనేతలు సమావేశమయ్యారు. .

ఇక నాలుగో సారి సమావేశమయ్యేందుకు 6న ప్లాన్ చేసుకున్నప్పటికి.. నితీశ్ కుమార్, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ వంటి వారు గైర్హాజరు కావడంతో సమావేశం వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఈ నెల 19 న మరోసారి సమావేశం అయ్యేందుకు ఇండియా కూటమి టైమ్ ఫిక్స్ చేసుకుంది. ఈ సమావేశం కాంగ్రెస్ అధ్యక్షతన జరగనున్నట్లు టాక్. కూటమిలోని ముఖ్య నేతలందరూ హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చిందనున్నట్లు వినికిడి. ముఖ్యంగా పి‌ఎం అభ్యర్థి విషయంలో ఈ సమావేశం ద్వారా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమి తరుపున రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, మమత బెనర్జీ వంటి వారు పి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉన్నారు. గత కొన్నాళ్లుగా పి‌ఎం అభ్యర్థిపై మల్లగులాల్లు పడుతున్న ఆగ్రనేతలు ఈసారైనా కన్ఫ్యూజన్ కు తెర దించుటరేమో చూడాలి.

Also Read:చలికాలంలో ఇవి తింటున్నారా?

- Advertisement -