- Advertisement -
పార్లమెంట్ ఎన్నికల సమరం జూన్ 1 నుండి ముగియనున్న సంగతి తెలిసిందే. ఏడో దశ పోలింగ్ జూన్ 1న జరగనుండగా ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక జూన్ 1న ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు.
ఈ భేటీకి కూటమిలోని పార్టీలతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం హాజరుకానున్నారు. ఆ తర్వాతి రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కోర్టులో సరెండర్ కావాల్సి ఉంది. అయితే తన మధ్యంతర గడువును 7 రోజుల పాటు పొడగించాలని ఇప్పటికే న్యాయస్థానాన్ని అభ్యర్థించారు కేజ్రీవాల్.
ఇక ఈసారి ఎన్నికల్లో మోడీకి భంగపాటు తప్పదని కూటమి నేతలు భావిస్తున్నారు. మరి ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతున్నాయో వేచిచూడాలి.
Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే
- Advertisement -