- Advertisement -
ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఏకతాటిపై నిలిచిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సిక్కిం రాష్ట్ర హోదా పొంది 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.
భారత్‌లో ఉగ్రవాదం వ్యాప్తికి సహకరించే వారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం అన్నారు. గత నెలలో పహల్గాం దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. భారత్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసేవారికి తగిన సమాధానం అన్నారు.
వాస్తవానికి ప్రధాని మోదీ నేడు సిక్కింలో నేరుగా పర్యటించాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించని కారణంగా ఈ పర్యటన రద్దైంది. దీంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
Also Read:ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై BRSV పోరుబాట
- Advertisement -

