ఆసియాకప్‌లో భారత్‌కు ఊహించని ఫలితం. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో విజయం ఖాయం అనుకున్నా.. మ్యాచ్ అనూహ్యంగా టైగా ముగిసింది. రాయుడు, రాహుల్ మెరిసినా 253 పరుగుల ఛేదనలో భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఛేదనలో భారత్‌కు రాహుల్, రాయుడు మెరుపు ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా ఓపెనర్‌గా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందొచ్చిన రాయుడు సిక్స్‌లతో చెలరేగాడు.
రాహుల్ 55 బంతుల్లో అర్ధసెంచరీ సాధిస్తే.. రాయుడు 43 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. అదే జోరులో మరో భారీ షాట్‌కు వెళ్లిన రాయుడు క్యాచ్ ఔట్ అయ్యాడు. కాసేపటికే రాహుల్ కూడా అతణ్ని అనుసరించాడు. వీళ్లిద్దరు ఔటయ్యాక భారత రన్‌రేట్ తగ్గింది. దీనికి తోడు ధోని (8), పాండే (8), జాదవ్ (19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కీలక సమయంలో కార్తీక్ (44) ఔట్ కావడంలో ఉత్కంఠ పెరిగిపోయింది. చివరికి మ్యాచ్ టై అయింది.
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్: షెజాద్ (సి) కార్తీక్ (బి) జాదవ్ 124; అహ్మది (స్టంప్డ్) ధోని (బి) జడేజా 5; రహ్మత్‌షా (బి) జడేజా 3; హస్మతుల్లా షాహిది (స్టంప్డ్) ధోని (బి) కుల్‌దీప్ 0; అస్గర్ (బి) కుల్‌దీప్ 0; నయిబ్ (సి) జాదవ్ (బి) చాహర్ 15; నబి (సి) కుల్‌దీప్ (బి) ఖలీల్ అహ్మద్ 64; జర్దాన్ ఎల్బీ (బి) జడేజా 20; రషీద్‌ఖాన్ నాటౌట్ 12; ఆఫ్తాబ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 7;
మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 252;
వికెట్ల పతనం: 1-65, 2-81, 3-82, 4-82, 5-132, 6-180, 7-226, 8-244;
బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 10-1-45-1; దీపక్ చాహర్ 4-0-37-1; సిద్ధార్థ్ కౌల్ 9-0-58-0; జడేజా 10-1-46-3; కుల్‌దీప్ 10-0-38-2; జాదవ్ 7-0-27-1
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ ఎల్బీ (బి) రషీద్ 60; రాయుడు (సి) నజిబుల్లా (బి) నబి 57; కార్తీక్ ఎల్బీ (బి) నబి 44; ధోని ఎల్బీ (బి) అహ్మది 8; పాండే (సి) షెజాద్ (బి) ఆఫ్తాబ్ 8; జాదవ్ రనౌట్ 19; జడేజా (సి) నజిబుల్లా (బి) రషీద్ 25; చాహర్ (బి) ఆఫ్తాబ్ 12; కుల్‌దీప్ రనౌట్ 9; కౌల్ రనౌట్ 0; అహ్మద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 9;
మొత్తం: (49.5 ఓవర్లలో ఆలౌట్) 252;
వికెట్ల పతనం: 1-110, 2-127, 3-142, 4-166, 5-204, 6-205, 7-226, 8-242, 9-245;
బౌలింగ్: ఆఫ్తాబ్ 10-0-53-2; ముజీబ్ 10-1-43-0; నయిబ్ 4-0-41-0; నబి 10-0-40-2; రషీద్ 9.5-0-41-2; అహ్మది 4-0-19-1; రహ్మత్‌షా 2-0-10-0.