దాస్‌తో ఉండే స్నేహ‌మే ‘దేవ‌దాస్’..

245
Nagarjuna
- Advertisement -

నాగార్జున‌, నాని హీరోలుగా శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన సినిమా దేవ‌దాస్. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్.. పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. హీరో నాగార్జున మాట్లాడుతూ..

Nagarjuna

దేవ కారెక్ట‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ డాన్ కారెక్ట‌ర్‌గా తీసుకున్నాం. దాంట్లో వ‌యోలెన్స్ కానీ.. మాఫియా యాక్టివిటీస్ కానీ చూపించ‌లేదు. ఎక్కువ‌గా ప‌ర్స‌న‌ల్ లైఫ్ చూపించాం. అందుకే నాకు కూడా కొత్త‌గా ఉంది. జ‌న‌ర‌ల్‌గా మాఫియా అన‌గానే అంతా ఒక‌లా ఊహిస్తారు. కానీ ఇది అలా ఉండ‌దు. అదే కొత్త‌గా ఉంటుంది కూడా. దాస్‌తో ఉండే స్నేహ‌మే దేవ‌దాస్ సినిమా. ఒక‌రిని ఒక‌రెలా ఇన్ఫ్లూయెన్స్ చేస్తార‌నేది సినిమాలో మెయిన్ పాయింట్. ఇది ఏదో సీరియ‌స్‌గా తీసిన సినిమా కాదు.. స‌ర‌దాగా న‌వ్వుతూ ఉండే సినిమా.

ముందు కృష్ణ‌దాస్ అనుకున్నాం.. కానీ ఆ త‌ర్వాత దేవ‌దాస్ అని పెట్టారు. పైగా దత్‌కి కూడా సెంటిమెంట్ మొన్నే మ‌హాన‌టి కూడా వ‌చ్చింది. దేవ‌దాస్ అనేది క్లాసిక్.. రీ కాల్ వ్యాల్యూ కూడా బాగుంటుంది. అందుకే రాయ‌ల్ సెల్యూట్ బాటిల్ కూడా పెట్టాం. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నాం.. అంద‌ర్నీ బ్యాలెన్స్ చేయ‌డం అనేది ద‌ర్శ‌కుడికి ఈజీ కాదు. చాలా ప్రెజ‌ర్ ఉంది. ఈ విష‌యంలో శ్రీ‌రామ్ ఆదిత్య చాలా మొండివాడు.

Nagarjuna

ఈ సినిమాలో నాకు బాగా న‌చ్చిన సాంగ్ ఏమో ఏమో.. అది నానికి ఇచ్చారు. జ‌లస్‌గా ఫీల్ అవుతున్నాను. సిధ్ శ్రీ‌రామ్ పాడాడు. ఇక వారు వీరు కూడా బాగుంది. నా ప‌క్క‌న అంద‌మైన అమ్మాయి కూడా ఉంది. చేసే సినిమాలు బ‌ట్టి నా గెట‌ప్ మారుతుంది. ఈ సినిమాలో కూడా యంగ్‌గా క‌నిపించ‌డానికి సినిమాటోగ్ర‌ఫ‌ర్ స్యామ్ ద‌త్ చాలా పెద్ద కంట్రిబ్యూట‌ర్ సినిమాకు. అన్ని డిస్క‌స్ చేసుక‌ని అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించారు.

- Advertisement -