అహ్మదాబాద్‌ టెస్ట్: కష్టాల్లో టీమిండియా

339
- Advertisement -

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించే దిశగా వెళ్తోంది ఇంగ్లండ్‌. టీమిండియా మిడిలార్డ‌ర్ విఫ‌లం కావ‌డంతో టీ స‌మయానికి 6 వికెట్ల‌కు 153 ప‌రుగులు చేసింది. క్రీజులో రిష‌బ్ పంత్ (36), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (1) ఉన్నారు. ఇంకా ఇంగ్లండ్ కంటే 52 ప‌రుగులు వెనుక‌బ‌డే ఉండ‌టంతో.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆధిక్యం సందేహంగానే క‌నిపిస్తోంది.

కెప్టెన్ కోహ్లి (0)తోపాటు పుజారా (17), ర‌హానే (27), అశ్విన్ (13) విఫ‌ల‌మ‌య్యారు. రోహిత్ శ‌ర్మ 49 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో అండ‌ర్స‌న్‌, స్టోక్స్‌, లీచ్ త‌లా రెండు వికెట్లు తీసుకున్నారు.తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 205 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పిచ్ స్పిన్ కు సహకరిస్తుండటంతో మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -