ఉప్పల్ వేదికగా విండీస్‌తో జరుగుతున్నరెండో టెస్టులో టీమిండియా 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారీ ఆధిక్యం సంపాదించే అవకాశాన్ని టీమ్‌ఇండియా చేజార్చుకుంది. భారత్ తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 59 పరుగులు మాత్రమే జోడించగలిగింది. విండీస్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌటైంది.
ఆదివారం ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాటు తడబడింది. మ్యాచ్ మొదలైన కాసేటికే హోల్డర్ వేసిన బంతికి రహానే(80; 183బంతుల్లో,4×7) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన తొలి టెస్టు సెంచరీ హీరో జడేజాను రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. శతకానికి చేరువైన రిషబ్ పంత్(92; 134 బంతుల్లో 11×4,2×6) గాబ్రియల్‌కు చిక్కాడు. 86.3 ఓవర్లో గాబ్రియల్ వేసిన బంతిని పంత్.. హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి టెస్టులో 92 పరుగులు చేసిన పంత్‌కు ఈ సారి కూడా శతకం కల నెరవేరలేదు.
అనంతరం క్రీజులోకి వచ్చిన కుల్‌దీప్ యాదవ్(6), ఉమేశ్‌యాదవ్(2) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. ఇక చివరిగా వచ్చిన అశ్విన్ కాసేపు క్రీజులో కుదురుకుని విండీస్ బౌలర్లను పరుగులు పెట్టించాడు. ఇక 106.4 ఓవర్లో గాబ్రియల్ వేసిన బంతికి అశ్విన్(35; 85బంతుల్లో, 4×4) బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 106 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌట్ అయింది. శార్దూల్ ఠాకూర్(4) నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ జట్టులో హోల్డర్ 5, గాబ్రియల్ 3, వారికన్ 2 వికెట్లు తీశారు.