నిఖిల్ ‘ముద్ర’తో రెడీ..!

229
- Advertisement -

నిఖిల్ హీరోగా తెర‌కెక్కుతోన్న ముద్ర సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంది. డ‌బ్బింగ్ ప‌నుల‌ను కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు. వాస్త‌విక సంఘ‌ట‌న‌ల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. స‌మాజంలో జ‌రుగుతున్న కొన్ని విష‌యాల‌ను ఎలా మీడియా ప‌రిష్క‌రిస్తుంది.. అందులో మీడియా బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు టిఎన్ సంతోష్. లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్‌తో జోడీక‌ట్టింది. ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్ అర్జున్ సుర‌వ‌రంగా న‌టిస్తున్నారు.

Nikhil Siddharth

ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా మ‌రియు రాజా ర‌వీంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి సంస్థ‌ల‌పై కావ్య‌ వేణుగోపాల్, రాజ్ కుమార్ ముద్ర సినిమాను నిర్మిస్తున్నారు. బి మ‌ధు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు. ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది.

Nikhil's 'Mudra'

న‌టీన‌టులు: నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర.. సాంకేతిన నిపుణులు: క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్, స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు, నిర్మాత‌లు: కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్, నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి, సినిమాటోగ్ర‌ఫీ: సూర్య, సంగీతం: స‌్యామ్ సిఎస్,ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్ ,ఫైట్స్: వెంక‌ట్, క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: రాగా రెడ్డి, డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: ర‌మా ర‌మేష్, రంగ‌నాథ్, లోకేష్, భ‌ర‌త్, అరు, బ్ర‌హ్మ, ప‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను,పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.

- Advertisement -