దేశంలో 24 కోట్ల టీకాల పంపిణీ: కేంద్రం

85
corona
- Advertisement -

దేశంలో ఇప్పటివరకు 24కోట్ల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర, కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 33,79,261 వ్యాక్సిన్‌లు పంపిణీ చేయగా దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయని పేర్కొంది.

అయితే కేసుల సంఖ్య తగ్గినా మృతుల సంఖ్య మాత్రం భారీగా పెరిగిపోయింది. 94,052 కేసులు నమోదు కాగా 6148 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,91,83,121కు చేరగా 2,76,55,493 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 3,59,676 మంది ప్రాణాలు కొల్పోయారు.

ప్రస్తుతం దేశంలో 11,67,952 యాక్టివ్‌ కేసులుండగా టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 23,90,58,360 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -