భారతీయ సమాజం..ఇదే ప్రత్యేకత

33
- Advertisement -

భిన్నత్వంలో ఏకత్వం అదే భారతదేశం యొక్క విశిష్టత. విభిన్న మతాలు, విభిన్న జాతులు,విభిన్న భాషలు,సంప్రదాయాలు,సంస్కృతులు,నమ్మకాలు. ఎన్ని వైరుధ్యాలున్న ఐక్యతకు మాత్రం కొవలేదు. దక్షిణానా హిందూ మహాసముద్రం,ఉత్తరాన హిమాలయాలు,పశ్చిమాన అరేబియా సముద్రం,తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి.

అలాగే విశాలమైన మైదాన ప్రాంతాలు,ఎడారులు,ద్వీపకల్పాలతో ఉండగా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. అన్నిరకాల పంటలు పండించడానికి ఇక్కడ అనువైన భూమి ఉంది.చేతి వృత్తులు, గ్రామీణ కుటీర పరిశ్రమలపై అనేక మంది ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. సమిష్టి కుటుంబం అనేది భారతీయ సమాజం ప్రత్యేకత.

భారత రాజ్యాంగం 18 భాషలను అధికారికంగా గుర్తించగా దేశంలో దాదాపు 1652 భాషలను మాట్లాడేవారున్నారు. దేశంలో 75 శాతం జనాభా ఇండో – ఆర్యన్ భాష సమూహం కిందకి అంటే ద్రవిడియన్,టిబెటెన్,యూరోపియన్,హిందీ,బుంగాలీ,మరాఠీ,గుజరాతి,ఒరియా,పంజాబీ,బిహారీ,రాజస్ధాన్,అస్సామీ,సంస్కృతం,సింధీ,కాశ్మీరీ మొదలైన భాషలు వస్తాయి. తమిళం, తెలుగు,కన్నడ,మలయాళం మొదలైన బాషలు ద్రవిడియన్ భాషా సమూహం కిందకి వస్తాయి.

Also Read:రేవంత్ ఏ పార్టీ లో ఉన్నా ఆ పార్టీ ఖతమే..

దేశంలో చాలా మతాలంఉడగా ప్రధానంగా హిందూ, ఇస్లాం, క్రైస్తవ,సిక్కు,బౌద్ధ,జైన మతాలున్నాయి. అత్యధికంగా హిందూ మతానికి చెందిన వారున్నారు. మతవిశ్వాసాలు విభిన్నమైనప్పటికి వాటన్నింటిలోనూ భగవంతుడు ఒక్కడే. విభిన్న మతాలకు చెందిన ప్రజలు విభిన్న రకాలైన ఆచారాలు,సాంప్రదాయాలు పాటిస్తున్నా భారతీయ ప్రజల్లో సాంస్కృతిక ఏకత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు విభిన్న మతాలకు, సముహాలకు చెందిన వారైనప్పటికీ వారిలో తామంతా భారతీయులమనే భావన ప్రబలంగా ఉంది.మరే దేశంలో చూడనటువంటి ఆచారాలను, భాషలను ఇక్కడే చూస్తూం.అందుకే మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని పిలుస్తారు.

ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలు వారి స్వంత భాషను, వంటకాలను, దుస్తులను కలిగి ఉంటాయి. తిరుపతి వెంకటేశ్వరాలయం, కాశీ విశ్వనాథ దేవాలయాలను మక్కా, వాటికన్ సిటీల కంటే ఎక్కువ మంది దర్శించుకుంటారు. ప్రపంచంలోని మరే దేశంలోనే లోని ఎక్కువ మసీదులు (300,000) భారతదేశంలోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల ఉంది. అది లక్నోలోని సిటీ మాంటిస్పోరి స్కూల్. దీనిలో విద్యార్థులు 45 వేలకు కంటే ఎక్కువగా ఉన్నారు.మహారాష్ట్రలోని శని శింగనాపూర్ అనే ఊరిలోని ఇండ్లకు తలుపులే ఉండవు. ఎందుకంటే వారి ఇండ్లలో ఏది దొంగిలించినా.. శనిదేవుని కోపానికి గురయ్యి తగిన శాస్తి జరుగుతుందని నమ్ముతారు. ఈ గ్రామంలో అసలు పోలీస్ స్టేషన్ కూడా ఉండదు.

Also Read:పచ్చి అరటికాయ తింటే ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -