విదేశీ గడ్డపై తెలంగాణం..

303
Independence day celebrations at London by TAUK
Independence day celebrations at London by TAUK
- Advertisement -

లండన్ లోని భారత హై కమీషన్ మరియు బారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన స్వాతంత్ర వేడుకల్లో, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణారాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది.

భారత హై కమిషనర్‌ వైకే సిన్హా ముందుగా జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. యూకే నలుమూలల నుండి వేలాదిమంది మంది ప్రవాస భారతీయులు ఈవేడుకలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ఉట్టి పడేలా చార్మినార్ ప్రతిమ తో ముఖద్వారం టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ అన్నిటిలో కంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు ఏర్పాటు చేసిన చార్మినార్ సెట్టింగ్ , తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భారీ కట్ ఔట్ ప్రదర్శనకే ఆకర్షణగా నిలిచాయి.

10
అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, బాషా, సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, తెలంగాణ నాయకత్వం, గత మూడు సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు….ఇలా వీటంన్నింటి సమాచారాన్ని స్టాల్ లో ప్రదర్శించి, హజారయ్యిన వారందరికీ తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకుమరియు ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావనతో, టాక్ సంస్థ అధ్వర్యం లో తెలంగాణ ప్రముఖులు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, పెట్టుబడులకు అనుకూల నిర్ణయాల సమాచారాన్ని, మూడు సంవత్సరాలుగా సాధించిన విజాయాల తో కూడిన ప్రత్యేక “తెలంగాణా స్టాల్ ” ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షురాలు పవిత్ర కంది తెలిపారు.
4
చేనే పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి, ముఖ్యంగా మంత్రి కే. టీ. ఆర్ గారి నాయత్వం లో చేనేత వస్త్రాల పై తీసుకొస్తున్న అవగాహనను కూడా టాక్ సంస్థ తన ప్రదర్శన లో పెట్టి, #Wearhandloom #Wesupportweavers అని ప్రతిజ్ఞ తో కూడిన ఫ్రేమ్ లో ఫోటో దించి వారి మద్దతును కోరారు.

5

భారత హై కమిషనర్‌ వైకే సిన్హా , భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా మరియు ఇతర ప్రతినిథిల బృందం “తెలంగాణా స్టాల్” ని సందర్శించి, తెలంగాణా సంస్కృతి – సాంప్రదాయాలు, ప్రభుత్వ పథకాలు, నాయకత్వ విజయాలు, పర్యాటకప్రత్యేకత, చార్మినార్ ప్రతిమతో ముఖద్వారం మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పై సమగ్ర సమాచారం – ప్రదర్శన చాలా గొప్పగా ఉందని, నూతన రాష్ట్ర సంస్కృతిని, గొప్పతన్నాని, పెట్టుబడులకుఅనుకూల పరిస్థితుల గురించి ప్రపంచానికి చూపేట్తాలనే ప్రయత్నం చాలా స్పూర్తి దాయకంగాఉందని ప్రసంశీంచారు. అలాగే తెలంగాణా రాష్ట్రం ముందుకు వెళ్తున్న తీరుగమనిస్తున్నామని, ఇంకా ఎన్నో ఆసక్తి కర విషయాలను టాక్ సంస్థ ప్రతినిధులనడిగి తెలుసుకున్నారు.
3
స్టాల్ లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల, తెలంగాణా ప్రముఖుల చిత్ర పటాలకు నివాళులర్పించి, స్వాతంత్ర దినోత్స్వాన్ని పురస్కరించి ఏర్పాటు చేసిన కేక్ ను భారత హై కమిషనర్‌ వైకే సిన్హా కట్ చేయడం జరిగింది. ప్రవాస తెలంగాణ బిడ్డలు ఏర్పాటు చేసిన స్టాళ్లని పరిశీలించి, తెలంగాణాకు ప్రత్యేక స్టాల్ ని చూడడం చాలాగర్వంగా ఉందని, తెలంగాణా ప్రాముక్యతను ప్రదర్శితున్న తీరుని అభినందించారు. చార్మినార్ ప్రతిమ తో ముఖద్వారం చాలా అందంగా, తెలంగాణ తనం విదేశీ గడ్డపై ఉట్టిపలే ఉందని, ఫోటో లతో, సెల్ఫీలతో టాక్ సంస్థ స్టాల్ సందడిగా మారింది.

2

చార్మినార్ ప్రతిమను ముఖద్వారంగా చేసి టాక్ స్టాల్ ని ఎంతో అందంగా తెలంగాణ ప్రత్యేకతను చాటేలా నిర్మించిన టాక్ ముఖ్య నాయకులు మల్లా రెడ్డి మరియు విక్రమ్ రెడ్డి లను హై కమిషనర్‌ వైకే సిన్హా మరియు కార్యదర్శి ఏ. యస్ రాజన్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

“తెలంగాణా జానపద నృత్యం ” ఇక్కడ జరిగిన సాంస్కృతిక వేదిక పై ప్రదర్శించడం విశేషం, అతిథులు కేరింతలతో ఎంతో ఉత్సాహంగా లేచి వారితో జత కలిసి నృత్యంచేయడం మరియు తెలంగాణ జానపద నృత్యం సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో హైలైట్ గా నిలవడం విశేషం. తెలంగాణా రాష్ట్రం నుండి ముందుకు వచ్చి ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని నెహ్రూ సెంటర్ నిర్వాహకాలు అభినందించారు.

6

జానపద నృత్య ప్రదర్శన ఇచ్చిన సత్య చిలుముల, వంశీ చిడిపోతు, నాగరాజు మన్నం, శివకుమార్ గ్రంధి, దేవి ప్రవీణ్ అడబాల( చెర్రీ) , తిరు కణపురం మరియు రుచిత రేణికుంట ల ను లను వీక్షించి ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా అభినందించారు. “తెలంగాణా స్టాల్” ని సందర్శించిన ఆతిథులందరికి మన “హైదరాబాద్ బిర్యానీ” రుచిచూపించడం జరిగింది.

8
ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ మట్టా రెడ్డిసభ్యులు వెంకట్ రెడ్డి దొంతుల,ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డిరేకుల, జాయింట్ సెక్రటరీ లు నవీన్ రెడ్డి ,శ్రీకాంత్ జెల్ల,ఇవెంట్స్ మరియు కల్చరల్ ఇన్‌ఛార్జ్ అశోక్ గౌడ్ దూసరి,రత్నాకర్ కడుదుల, రీడింగ్ సెక్రటరీ మరియు స్పోర్ట్స్ఇంచార్జ్ మల్లా రెడ్డి, మహిళా విభాగం ఇంచార్జ్ సుమా దేవిపురుమని,మహిళా విభాగం సెక్రటరీ సుప్రజ పులుసు,మహిళావిభాగం సభ్యులు ప్రవల్లిక భువనగిరి,క్రాంతి రత్తినేని,కల్చరల్సెక్రెటరీలు సత్య చిలుముల,శ్రావ్య వందనపు,కల్చరల్ కోఆర్డినేటర్ శైలజ జెల్ల,స్పాన్సర్ సెక్రటరీ రవి రత్తినేని,I.Tఇంచార్జ్ రవి ప్రదీప్ పులుసు మరియు సంస్థ సభ్యులురవికిరణ్ ,వెంకీ సుదిరెడ్డి , నవీన్ భువనగిరి,సుషుమ్న, సుమ,అపర్ణ తదితరులుపాల్గొన్న వారిలో ఉన్నారు.

- Advertisement -