సౌతాఫ్రికా మరియు టీమిండియా మధ్య జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పై సౌతాఫ్రికా జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 180 పరుగులు చేసింది. మరో మూడు బంతులు మిగిలుండగానే వర్షం రావడంతో అంతటితోనే మ్యాచ్ ముగించారు. టీమిండియా బ్యాట్స్ మెన్స్ లో రింకూ సింగ్ ( 39 బంతుల్లో 68 పరుగులు ), సూర్య కుమార్ యాదవ్ ( 36 బంతుల్లో 56 ) అర్ధ సెంచరీలతో రాణించి జట్టుకు మంచి స్కోర్ ను అందించారు. ఆ తర్వాత వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 ఓవర్లలో 152 పరుగులు నిర్దేశించారు. .
బ్యాటింగ్ కు దిగిన సఫారీలు 13.5 ఓవర్లలోనే 50 ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి విజయం సాధించారు. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లలో హెన్ డ్రిక్స్ ( 27 బంతుల్లో 49 పరుగులు ), మార్క్ రమ్ ( 17 బంతుల్లో 30 పరుగులు ) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయం తో సఫారి జట్టు 1-0 తేడాతో ముందు నిలిచింది. ఇక రేపు జరిగే మూడో మ్యాచ్ కీలకంగా మారింది. ఆ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు టీ20 సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే తాజాగా మరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓటమికి వర్షామే కారణమని ఆ జట్టు మాజీ ప్లేయర్ డెల్ స్టెయిన్ చెప్పుకొచ్చారు. వర్షం కారణంగా పిచ్ తడిగా మారి బాల్ జారిపోయిందని, ఫలితంగా బ్యాటిమ్ చేసే వారికి అనుకూలంగా మారిందని స్టెయిన్ చెప్పుకొచ్చారు. ఈ ఓటమిని పెద్దగా విశ్లేషించాల్సింది ఏమిలేదని కేవలం వర్షం కారణంగానే మ్యాచ్ ఫలితం డిసైడ్ అయిందని స్టెయిన్ అన్నారు.
Also Read:Review 2023: ఫ్లాపైన రీమేక్ సినిమాలు