రెండో వన్డేలో టీమిండియా గెలుపు

180
ind
- Advertisement -

తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. సఫారీలు విధించిన 279 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 45.5 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 282 పరుగులు చేసి విజయాన్ని సాధించింది.

శ్రేయస్‌ అయ్యర్‌ (111 బంతుల్లో 113 నాటౌట్‌; 15 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగగా.. ఇషాన్‌ కిషన్‌ (84 బంతుల్లో 93; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రేయస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం ఢిల్లీలో జరుగనుంది.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. హెండ్రిక్స్‌ (74; 9 ఫోర్లు, ఒక సిక్సర్‌), మార్క్మ్‌ (79; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకాలతో రాణించగా.. క్లాసెన్‌ (30), డేవిడ్‌ మిల్లర్‌ (35 నాటౌట్‌), మలన్‌ (25) పరుగులు చేశారు.

- Advertisement -