దక్షిణాఫ్రికా టెస్టు: వర్షం కారణంగా 2వ రోజు మ్యాచ్‌ రద్దు..

165
- Advertisement -

సెంచురియన్‌ వేదికగా నిన్న టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ఆటను టీమిండియా 3 వికెట్లకు 272 పరుగుల వద్ద ముగించింది. ఇక సోమవారం రెండో రోజు ఆట ప్రారంభానికి వర్షం ఆటంకం ఏర్పడింది. దీంతో రెండో రోజు ఆట రద్దైంది. ఉదయం నుంచి వర్షం పడుతుండడంతో ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానం చిత్తడిగా మారింది. ఓసారి వర్షం ఆగడంతో మైదానంలోని నీటిని తొలగించేందుకు గ్రౌండ్ స్టాఫ్ ప్రయత్నిస్తుండగా.. అంతలోనే మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో నీటి తొలగింపు చర్యలు నిలిచిపోయాయి.

లంచ్‌ టైం వరకూ వర్షం తగ్గకపోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఇరుజట్ల ఆటగాళ్లు లంచ్‌కు వెళ్లారు. లంచ్ తర్వాత అంపైర్లు మరోసారి మైదానాన్ని పరిశీలించాలని నిర్ణయించినా, పరిస్థితి అందుకు అనుకూలంగా కనిపించడంలేదు. జల్లులు కురుస్తూనే ఉండడంతో ఆట రద్దు చేస్తూ బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఓపెనర్ కేఎల్ రాహుల్ (122 బ్యాటింగ్) అద్భుత సెంచరీ సాయంతో టీమిండియా సఫారీ జట్టుపై పైచేయి సాధించింది. క్రీజులో కేఎల్ రాహుల్ కు తోడు అజింక్యా రహానే (40 బ్యాటింగ్) ఉన్నాడు.

- Advertisement -