Ind VS Pak:రిజర్వ్‌ డేకు దాయాదుల పోరు

54
- Advertisement -

దాయాదుల పోరు రిజర్వ్ డేకు చేరింది. వరణుడి కారణంగా ఆట మధ్యలో నిలిచిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 24.1 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు న‌ష్టాపోయి 147 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (17), విరాట్ కోహ్లి (8) లు క్రీజులో ఉన్నారు. భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్ శ‌ర్మ (56; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), శుభ్ మ‌న్ గిల్ (58; 52 బంతుల్లో 10 ఫోర్లు) రాణించారు. అయితే ఇద్దరు త్వరత్వరగా వెనుదిరిగారు.

విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లు కుదురుకుని జోరు పెంచే స‌మ‌యంలో వ‌ర్షం మొద‌లైంది. . వ‌రుణుడు తెరిపి నిచ్చిన‌ గంట సేప‌టి త‌రువాత మ్యాచ్‌ను నిర్వ‌హించేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు. అంపైర్లు మైదానాన్ని ప‌రిశీలిస్తుండ‌గా మ‌రోసారి వ‌ర్షం ప్రారంభ‌మైంది. దీంతో మ్యాచ్‌ను మ‌రుస‌టి రోజుకు వాయిదా వేశారు. దీంతో మ్యాచ్‌ను సోమ‌వారం (సెప్టెంబ‌ర్ 11)కి వాయిదా వేస్తున్న‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు.

Also Read:బ్లాక్ టీ తో ఆరోగ్య ప్రయోజనాలు

- Advertisement -