దాయాదుల పోరు ఏ ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. వరణుడి అడ్డంకితో అంపైర్లు మ్యాచ్‌ని నిలిపివేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(10), విరాట్ కోహ్లి(4), శ్రేయస్ అయ్యర్ (14) విఫలం అయ్యారు. పాక్‌తో మ్యాచ్ అందులో 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (82; 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (87; 90 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ రాణించడంతో భారత్ 250 పరుగులు దాటింది.పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ అప్రీది నాలుగు వికెట్లు తీయగా, నదీమ్ షా, హారిస్ రవూఫ్ లు చెరో మూడు వికెట్లు తీశారు.
Also Read:గుడ్డులోని పచ్చసోనా తింటే ప్రమాదమా?