టీ20 వరల్డ్ కప్‌లో రెండో సెమీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ముంబై వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్‌కు చేరుకునే లక్ష్యంతో ఇరు జట్లు పోటీకి సిద్ధమవుతున్నాయి. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు నిండుగా ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇరు జట్ల ఓపెనింగ్ జోడీల గణాంకాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. భారత్ తరఫున అభిషేక్ శర్మ, సంజూ సాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు. ఈ వరల్డ్ కప్‌లో అభిషేక్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయినా, వెస్టిండీస్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు.
అభిషేక్ శర్మ ఇప్పటివరకు భారత్ తరఫున 44 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 1,377 పరుగులు సాధించాడు. అతని సగటు 33.58గా ఉంది. మరోవైపు సంజూ సాంసన్ 60 టీ20 మ్యాచ్‌లు ఆడి 1,221 పరుగులు చేశాడు. అతని సగటు 25.97గా ఉంది.
Also Read:TTD:15న పుష్పయాగ మహోత్సవం
ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ . ప్రస్తుత వరల్డ్ కప్‌లో వీరి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా, టీ20 ఫార్మాట్‌లో వారి గణాంకాలు బలంగా ఉన్నాయి. ఫిల్ సాల్ట్ 59 టీ20 మ్యాచ్‌లు ఆడి 1,712 పరుగులు చేశాడు. అతని సగటు 34.93. జోస్ బట్లర్ అయితే 132 టీ20 మ్యాచ్‌ల అనుభవంతో 4,012 పరుగులు సాధించాడు. అతని సగటు 33.71గా ఉంది. మొత్తంగా ఇంగ్లాండ్ ఓపెనర్లు అనుభవం, స్థిరత్వంలో ముందున్నట్లు కనిపిస్తున్నా, మ్యాచ్ రోజున ఎవరు మెరుగ్గా ఆడతారో చూడాలి.

