‘టాక్సిక్’..రిలీజ్ డేట్ వాయిదా

5
- Advertisement -

యశ్ నటిస్తున్న భారీ చిత్రం Toxic. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్ట పోన్ అయింది. వాస్తవానికి ఈ సినిమా మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. అదే రోజున ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధురంధర్ 2’ కూడా విడుదలకు సిద్ధమైంది.

తాజా అప్‌డేట్ ప్రకారం ‘ధురంధర్ 2’ మార్చి 19న సోలో రిలీజ్‌గా విడుదల కానుండగా, ‘టాక్సిక్’ను 2026 జూన్ 4కి వాయిదా వేశారు.

అయితే దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. మార్చి 19న ‘టాక్సిక్’ విడుదలైతే ఇంగ్లీష్ మాట్లాడే ప్రేక్షకులకు చేరుకునే అవకాశాలు తగ్గిపోయేవి. ఇది ఓవర్సీస్ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్న భారీ బడ్జెట్ చిత్రం. ఇప్పుడు యశ్ ‘KGF’ రికార్డును సులభంగా బ్రేక్ చేస్తాడు అన్నారు.

Also Read:TTD:15న పుష్పయాగ మహోత్సవం

దీనికి మరో యూజర్ స్పందిస్తూ, “ఇది రెండు సినిమాలకు కూడా మంచి వార్తే. #Dhurandhar2 & #ToxicTheFilm రెండూ భారతీయ చిత్రాలే. రెండూ 1000 కోట్ల క్లబ్‌లో చేరాలని కోరుకుంటున్నాం” అని వ్యాఖ్యానించారు. మొత్తానికి ‘టాక్సిక్’ వాయిదా నిర్ణయం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

- Advertisement -