టీమిండియా అదే తడ’బ్యాటు’!

2
- Advertisement -

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తడబాటుకు గురైంది. ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 82 ,కెప్టెన్ రోహిత్ శర్మ (3) , కేఎల్ రాహుల్ (24), విరాట్ కోహ్లీ (36) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో పంత్ 6, జడేజా 4 పరుగులతో ఉండగా రెండో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్ 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140 పరుగులతో రాణించగా భారత బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3, ఆకాశ్ 2, సుందర్ 1 వికెట్ పడగొట్టారు.

Also Read:మన్మోహన్‌కు టీమ్‌ఇండియా ఘన నివాళి..

- Advertisement -