ఆసీస్ పై ప్రతీకారం తీర్చుకుంటారా?

55
- Advertisement -

ఎన్నో ఆశలు పెట్టుకున్న వరల్డ్ కప్ లో భారత్ ను చిత్తు చేసి కప్పు సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. వరల్డ్ కప్ తరువాత నేటి నుంచి ఆస్ట్రేలియా తో ఐదు టీ20ల సిరీస్ కోసం తలపడనుంది. ఈ సిరీస్ కు సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్, కే‌ఎల్ రాహుల్ దూరంగా ఉండనున్నారు. దాంతో ఈ సిరీస్ మొత్తం యువ ఆటగాళ్లతోనే బరిలోకి దిగనుంది టీమిండియా. నేడు జరిగే తొలి మ్యాచ్ వైజాగ్ లోని రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ సిరీస్ మొత్తానికి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అటు ఆసీస్ జట్టుకు మాథ్యూ వేడ్ సారథిగా బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఈ సిరీస్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా చోటు సంపాధించుకున్నాడు. వరల్డ్ కప్ లో ఆడిన కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఈ సిరీస్ ఆడనున్నాడు. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ తో పాటు ప్రసిద్ద్ కృష్ణ, మరియు శ్రేయస్ అయ్యర్ రెండో మ్యాచ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఇక టీ20 ల పరంగా ఇరు జట్ల గణాంకాలు చూస్తే టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఆసీస్ టీమిండియా మధ్య 26 టీ20 మ్యాచ్ లు జరగగా.. వాటిలో భారత్ 15, ఆస్ట్రేలియా 10, విజయాలతో ఉండగా మరోటి ఫలితం తేలనిదిగా ఉంది. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఓటమి ఇప్పటికీ కూడా అభిమానులను బాధిస్తూనే ఉంది. మరి వన్డే వరల్డ్ కప్ లో జరిగిన ఘోర పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టీ20 సిరీస్ లో యువ ఆటగాళ్లు ఆసీస్ పై ప్రతీకారం తీర్చుకుంటారేమో చూడాలి.

తుది జట్ల అంచనా :
టీమిండియా ; ఇషన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ( కెప్టెన్ ), తిలక్ వర్మ, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్ / వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ / ఆవేష్ ఖాన్, ముకేష్.

ఆస్ట్రేలియా ; షార్ట్, స్మిత్, స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ ( కెప్టెన్ ) ఇంగ్లీస్, అబాట్, ఎల్లిస్, బెహ్రెమ్దర్ఫ్, తంవీర్ సంఘా, హార్ది

Also Read:చలికాలంలో కీరదోస తింటే ఎన్నో ప్రయోజనాలో..!

- Advertisement -