పెరిగిన విమర్శలు.. ప్రభాస్ ఎక్కడ

40
- Advertisement -

టాలీవుడ్‌లో తన సినిమాను మొదటిరోజే హైదరాబాద్‌ థియేటర్లలో చూసేవాడు ప్రభాస్. దీనితో ప్రభాస్‌ ఎక్కడ.. అంటూ ఫాన్స్ లో డిస్కషన్ మొదలైంది. ఐతే నిన్న విడుదలైన ఆదిపురుష్‌ చిత్రాన్ని ఇక్కడ ఫ్యాన్స్‌ తాకిడి పెరిగిపోవడంతో అమెరికాలో ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రభాస్‌ చూశాడట. బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత ఫాన్స్ తాకిడి పెరిగి పోవడంతో ఫారెన్లో తన సినిమాను చూసేందుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. మరోవైపు ఆదిపురుష్‌ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సెలబ్రిటీల జాతకాలు చెప్పే జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆదిపురుష్ సినిమా రిలీజ్‌కు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి.. ప్రభాస్ జాతకంలో దోషం ఉందని ఇక ఆయన సినిమాలు హిట్ కావడం కష్టమేనని చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ కూడా హిట్ కొట్టదని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్‌ వస్తుండడంతో వేణుస్వామి మాటలు నిజమయ్యాయని పలువురు చర్చించుకుంటున్నారు.

Also Read: జిలేబి టీజర్‌ విడుదల

మరోవైపు హీరో ప్రభాస్‌ ఫ్యాన్స్‌పై శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. ఆదిపురుష్ సినిమా బాగలేదని ఓ యువకుడు చెప్పడంతో ప్రభాస్ అభిమానులు అతన్ని చితక్కొట్టారు. దీనిపై శ్రీరెడ్డి స్పందించారు. ‘అరేయ్, ప్రభాస్ ఫ్యాన్స్‌కి దమ్ము ఉంటే వెళ్ళి ఆ ఓం రౌత్‌‌ను కొట్టండి. అంతేకానీ ఐ మాక్స్ దగ్గర పిల్లల మీద కాదు మీ ప్రతాపం. రామాయణం తియ్యాలంటే అది రాజమౌళి నే.’ అని ట్విట్టర్‌లో పోస్టు పెట్టింది.

Also Read: పెళ్లికి నేనూ రెడీ: కంగనా

- Advertisement -