నటి జయప్రదను సమాజ్ వాదీపార్టీ కి చెందిన ఓ సీనియర్ నేత తీవ్ర ఆవేదానికి గురిచేశారు. ఆ సీనియర్ నేత ఎవరో కాదు..ఆజాం ఖాన్. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఎస్పీ పార్టీ బహిష్కృత నేత జయప్రద. 2009లో యూపీలోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగిన సందర్భంలో ఆజాంఖాన్ తనను తీవ్ర ఆవేదనకు గురిచేశారని ఆరోపించారు.
అంతేకాదు ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ ‘పద్మావత్’లోని ప్రతినాయక పాత్ర ఖిల్జీతో ఆయన్ను పోల్చారు జయప్రద. ఆ చిత్రాన్ని చూస్తున్నంతసేపు ఖిల్జీపాత్ర ఆజాంఖాన్ జీను ప్రతిఫలించిందని ఇటీవల జయప్రద ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వ్యాఖ్యానించారు.
కాగా..2009, మే, నెలలో జరిగిన ఎన్నికల సందర్భంగా తన ప్రతిష్టను దిగజార్చడానికి ఆజాం చౌకబారు ప్రయత్నాలు చేశారని, తనఫొటోలను అభ్యంతరకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి సీడీల రూపంలో పంపిణీ చేశారని గతంలోనూ జయప్రద ఆజాం పై తీవ్ర ఆరోపణలు చేశారు.