- Advertisement -
ప్రధాని పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు ఇమ్రాన్ ఖాన్. అవిశ్వాస తీర్మానంపై పోరాటం చేస్తున్న ఇమ్రాన్….జాతినుద్దేశించి మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులతో కలసి ముగ్గురు దొంగలు పనిచేస్తున్నారని మండిపడ్డారు.
కొన్ని విదేశాల నుంచి మాకు మెసేజ్‌లు వస్తున్నాయని…విదేశీ శక్తులు కుట్ర చేస్తుంటే.. దేశం లోపల వారికి సహకరించే శత్రువులు కూడా ఉన్నారని, ఇద్దరు కీలక మిత్రపక్షాలు ఫిరాయించిన తర్వాత జాతీయ అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
పాకిస్తాన్ నాకంటే 5 సంవత్సరాలు మాత్రమే పెద్దది, నేను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టిన మొదటి తరానికి చెందినవాడిని అన్నారు. చిన్నతనంలో పాకిస్తాన్ అగ్రస్థానానికి చేరుకోవడం నాకు గుర్తుంది. ఇండియా, యూఎస్‌లో చాలా మంది స్నేహితులు ఉన్నారని తెలిపారు.
- Advertisement -