పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌.. రికార్డ్‌..!

239
- Advertisement -

మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ రికార్డులను తిరగరాశారు. పాక్ లో వంశపార్యపరంగా వస్తున్న రెండు అతిపెద్ద పవర్‌ హౌజ్‌లను ఇమ్రాన్ కొల్లగొట్టారు. పాకిస్తాన్‌ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు మమ్‌నూన్‌ హుస్సెన్‌ ఇమ్రాన్‌చే ప్రమాణ స్వీకారం చేయించారు.

చాలా సాధారణంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దిగ్గజ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్దు కూడా పాల్గొన్నారు. తన స్నేహితుడైన సిద్దూను మొదటి వరుసలోనే కూర్చోబెట్టి గౌరవించారు ఇమ్రాన్‌ ఖాన్. ప్రమాణస్వీకారం సమయంలో సిద్ధూ ఎంతో ఆనందంగా గడిపారు. ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది.

 Imran Khan

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా జులై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ కు చెందిన పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) 116 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. కేవలం 21 స్థానాల దూరంలోనే 272 స్థానాల్లో పోటీ చేసిన పీటిఐ అధికారాన్ని కోల్పోయింది.

 Pakistaniఅయితే సాధారణ ఎన్నికల అనంతరం నేషనల్‌ అసెంబ్లీ సభ్యులతో ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడం పాక్‌ లో ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు 176 ఓట్లు రాగా, షాబాజ్‌ షరీఫ్‌కు 96 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ ..ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రధానిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది.

- Advertisement -