శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శనివారం తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం వేద సందేశం, శ్రీమతి పద్మావతి దేవి బృందం విష్ణుసహస్రనామపారాయణం, శ్రీమతి మాధవీలత బృందం భక్తి సంగీతం, ఆచార్య చక్రవర్తి రంగనాధన్ భక్తామృతం ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం శ్రీ మథుసూదన్‌రావు బృందం అన్నమయ్య విన్నపాలు, శ్రీమతి జోత్స్న బృందం హరికథా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు నాదలయ సురభి బృందం భక్తి సంగీతం, అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గోపాలరావు బృదం సంగీతం, శ్రీ రామచంద్ర పుష్కరిణి వేదికపై శ్రీవళ్ళి బృదం నృత్యం ప్రదర్శించారు.
Also Read:Bigg Boss 7 Telugu:ఇంటి సభ్యులకు క్లాస్ పీకిన నాగ్