శివరాత్రి ప్రాముఖ్యత ఏంటో తెలుసా ?

42
- Advertisement -

మన దేశ హిందూ సంప్రదాయం ప్రకారం మహా శివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భక్తులు శివరాత్రిని జరుపుకుంటారు. ఈ పండుగ తెలుగు క్యాలెంటర్ ప్రకారం మాఘ మాసంలో కృష్ణపక్షం చతుర్థశి తిథిన వస్తుంది. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చి ఈ పండుగ వస్తుంది. ఈ శివరాత్రి పర్వదినానికి ముందు భక్తులు నిష్టగా ఉపవాసంతో ఆ పరమశివుడికి పూజలు చేస్తారు. శివరాత్రి రోజున జాగరణ చేస్తూ శివనామస్మరణతో పరవశించిపోతారు. మన హిందూ సంప్రదాయాల్లో చాలా పండుగలు పగటిపూట జరుపుకుంటే శివరాత్రి, దీపావళి వంటి పండుగలను రాత్రి పూట జరుపుకుంటారు. ఇలా శివరాత్రిని రాత్రిపూట ఎందుకు జరుపుకుంటారు ? అసలు ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి శివరాత్రి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం !

సాధారణంగా శివరాత్రి పండుగ జరుపుకోవడానికి శాస్త్రీయంగా రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో మొదటిది క్షీరసాగర మధనం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పురాణ కాలంలో దేవతలు, అసురులు అమృతం కోసం క్షీరసాగర మధనం జరపగా అందులో ముందు బయటకు వచ్చిన విషాన్ని మహాశివుడు మింగడంతో నీలకంటేశ్వరుడిగా మారతాడు. గొంతులో ఉండే ఆ విషం శరీరమంతా వ్యాపించకుండా ఉండేందుకు శివుడు నిద్ర పోకుండా ఉండాలని దేవతలు, అసురులు అందరూ కలిసి ఐదు జాముల కాలంలో ఏకకాలంగా ఆడి పాడుతూ జరగణ చేస్తారు. అలా జాగరణ చేసిన రోజున శివరాత్రి గా జరుపుకుంటారు.

ఇక శివరాత్రి జరుపుకోవడానికి మరో కథ కూడా ప్రాచుర్యం లో ఉంది. త్రిమూర్తులుగా ఉండే మహావిష్ణువు మరియు బ్రహ్మ మధ్య ఎవరు గొప్ప అనే తగువు ఏర్పడుతుంది. సృష్టిని సృష్టించింది తానే కాబట్టి తానే గొప్ప అని బ్రహ్మ, సృష్టికి మూలం నేనే కాబట్టి తానే గొప్ప అని విష్ణువు మధ్య తగువు పెరిగి పెద్దదవుతుంది. ఆ తగువు తగ్గించానికి శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు, అలా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమైన రోజును శివరాత్రిగా జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.

మహాశివరాత్రిని హైందవ సంప్రదాయం పాటించే ప్రతి ఒక్కరూ అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. నిష్టగా ఉపవాసం ఉంటూ మనసంతా దైవ నామ స్మరణ చేస్తూ ఉపవాసంలో ఉంటారు సాయంకాలం లింగరూపంలో ఉన్న శివుడిని దర్శించుకొని పండ్లు, ప్రసాదాన్ని సేవించి ఉపవాస విరమణ చేస్తారు. ఇలా శివరాత్రి రోజున భక్తి పారవశ్యంతో ఆ మహాశివుడి నామస్మరణ చేస్తూ పరవశించిపోతారు భక్తులు. అందుకే ఈ పండుగను అత్యంత ప్రీతికరంగా జరుపుకుంటారు.

Also Read:శివరాత్రి…ఉపవాసం ఎందుకు!

- Advertisement -