BB9:కొత్త కెప్టెన్‌గా ఇమ్మూ

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 61 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా హౌస్‌లో కెప్టెన్‌గా నిలిచారు ఇమ్మాన్యుయేల్. కొత్త కెప్టెన్‌ని డిసైడ్ చేసేందుకు పెట్టిన టాస్కులో చివరిగా రీతూ, తనూజ, ఇమ్మూ మిగిలారు. ఇమ్మూ ఈ రేసులో ఉండాలంటే తనూజనే తీసేయాలనిపించింది.. అంటూ కళ్యాణ్‌కి చెప్పింది దివ్య. దివ్య మాటలకి కళ్యాణ్ జవాబిచ్చాడు. దివ్య నీ దగ్గరి నుంచి లాక్కోవడం నాకు పెద్ద మేటర్ కాదు.. కానీ నువ్వు తనూజని తీయనన్నావనే నీకు ఇచ్చాను.. అని కళ్యాణ్ అన్నాడు.

ఈ క్రమంలో అందరూ తనూజకి సపోర్ట్‌గా నిలవడంతో నేను తనూజని తీయనని చెప్పాను కానీ.. అంటూ అడగకపోయినా సుమన్ శెట్టితో మాట్లాడింది దివ్య. కాసేపటి తర్వాత భరణితో మళ్లీ ఇదే టాపిక్ డిస్కస్ చేసింది తనూజ. దీంతో ఆమె (దివ్య) నాకు సపోర్ట్ చేయట్లేదు ఇమ్మూకి సపోర్ట్ చేస్తుంది.. కొంచెం ఆలోచించు.. అని భరణి అన్నాడు. ఓకే తను ఇమ్మూకే సపోర్ట్ చేస్తుంటే నన్ను తీసేటప్పుడు మీ వైపు అంత సేపు చూడాల్సిన అవసరం ఏంటి అన్నాడు భరణి.

తర్వాత కెప్టెన్సీ రూమ్ దగ్గరికి కళ్యాణ్ రాగానే భరణి గురించి మాట్లాడింది దివ్య. ఊరికే మాట పడుతున్నాను కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే నేను తీసుకోను.. అందుకే ఇక లైట్ తీసుకున్నా.. సడెన్‌గా అరిస్తే ఇలా షాకయ్యాను కానీ.. నాకేంటి.. అంటూ దివ్య అంది.

తర్వాత కెప్టెన్సీ రేసులో చివరిగా మిగిలిన ఇమ్మానుయేల్-రీతూ ఇద్దరికీ ‘కౌంట్ ఇట్ క్రాక్ ఇట్’ అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్కుకి తనూజని సంచాలకులుగా పెట్టాడు. ఈ గేమ్‌లో గార్డెన్ ఏరియాలో పలు రకాల వస్తువులు పెట్టి వాటిని కౌంట్ చేసి.. ముందుగా ఎవరు తమ ఫ్లాగ్ ఎగరేస్తారో వాళ్లు విన్ అవుతారు. ఈ గేమ్‌లో రీతూ కంటే ముందు టాస్క్ కంప్లీట్ చేసి ఇమ్మానుయేల్‌ హౌస్‌కి రెండోసారి కెప్టెన్ అయిపోయాడు.

Also Read:SSMB29:రాజమౌళి మూవీ..బిగ్ అప్‌డేట్

- Advertisement -