2022…అత్యుత్తమ నటుల జాబితా

59
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులు యేడాది పొడవునా మనల్ని అలరిస్తారు. వీళ్లందరిలో ఎవరు బెస్ట్ అని తెలుసుకోవాలనే కుతూహలం మనకెప్పుడూ ఉంటుంది. తాజాగా 2022వ సంవత్సరంలో అత్యుత్తమ నటన, అత్యంత ప్రజాదారణ, అత్యధిక పారితోషికం తీసుకున్న నటులను ఐఎండీబీ ఇటీవలే ప్రకటించింది. ఆలిస్టులో మీ ఫేవరెట్ హీరో ఉన్నారా లేరా చెక్‌ చేసుకొండి.

డ్వైన్ జాన్సన్‌
ప్రపంచంలో ఉత్తమ నటుల జాబితాలో అగ్రస్థానంలో దిరాక్ అయిన డ్వైన్‌ ఉన్నారు. ఇతను 1992 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. కెరీర్‌ ప్రారంభంలో రెజ్లర్‌గా ఉన్నారు. ప్రస్తుతం నికర విలువ 800మిలియన్‌ డాలర్లతో ఐఎండీబీలో మొదటి స్థానంలో ఉన్నారు.

షారుఖ్‌ ఖాన్
బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ డ్వైన్ జాన్సన్‌ తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు. భారతీయ చలన చిత్ర రంగంలో అనేక మైలురాలు దాటిన బాద్‌షా భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు పొందారు. ప్రస్తుత నికర విలువ 725మిలియన్‌ డాలర్లు.

జాకీ చాన్
2022వ సంవత్సరానికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాదరణ పొందిన చైనీస్ నటుడు. మార్షల్ ఆర్టిస్ట్‌ ఫిల్మ్ మేకర్ మరియు స్టంట్ మ్యాన్‌గా పలు సేవలు అందించనున్నారు. స్టంట్‌ మ్యాన్ గా కెరీర్ ప్రారంభించిన జాకీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా ఎదిగారు. ఇతని నికర విలువ 400మిలియన్‌ డాలర్లు.

సల్మాన్‌ఖాన్
బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఉన్న ఇతను పరోపకారి. భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. ఇతని నికర విలువ 350మిలియన్‌ డాలర్లు వచ్చే యేడాది టైగర్‌3 సినిమాతో రానున్నారు.

విల్‌ స్మిత్‌
యేడాది ప్రారంభంలో ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌లో తొటి నటుడ్ని కొట్టిన విల్ స్మిత్‌ అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు. ఇతను హాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. మరియు ఆస్కార్ విజేత. నికర విలువ 350 మిలియన్ డాలర్లు.

రాబర్ట్ డౌనీ జూనియర్
మార్వెల్‌ కామిక్ సినిమాల ద్వారా ఐరన్ మ్యాన్‌ పాత్రకు మంచి ప్రేక్షకాదరణ కలిగిన నటుడు. ఈయన షెర్లాక్ హోమ్స్‌ లాంటి ఫిక్షన్ కథలలో నటించి అభిమానుల మెప్పు పొందారు. నికర విలువ 300మిలియన్ డాలర్లు.

లియోనార్డో డికాప్రియో
టైటానిక్ స్టార్ లియోనార్డో డికాప్రియో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరు. టైటానిక్ సినిమా అత్యధిక వసూళ్లును సాధించడమే కాదు తన కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇతని నికర విలువ 300మిలియన్‌ డాలర్లు.

విన్‌ డీజిల్
ఫాస్ట్ అండ్ ఫూర్యియస్ సిరీస్‌ల నటుడు విన్ 2022వ సంవత్సరానికి గాను అత్యుత్తమ నటులలో ఒకరు. ఇతను xxx గార్డియన్స్‌ ఆఫ్ దిగెలాక్సీ ఫైండ్ మీగిల్టీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇతని నికర విలువ 225మిలియన్‌ డాలర్లు.

క్రిస్ హెమ్స్‌వర్త్‌
ది గాడ్ ఆఫ్ థండర్‌గా పెరుగాంచిన ఆస్ట్రేలియన్ థోర్‌ క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ అత్యుత్తమ ప్రజాదరణ పొందిన నటులల్లో ఒకరు. ఇతను మార్వెల్‌ సిరీస్‌లో థోర్‌గా కనువిందు చేయనున్నారు. నికర విలువ 130మిలియన్‌ డాలర్లు.

క్రిస్ ఎవాన్స్‌
కెప్టెన్ అమెరికా స్టార్ క్రిస్‌ ఎవాన్స్ 2022వ సంవత్సరానికి గాను ఉత్తమ నటులో ఒకరిగా నిలిచారు. మరియు ఇటీవల కాలంలో నిర్ణయించిన ఓ సర్వేలో సెక్సీయెస్ట్ మ్యాన్‌గా నిలిచారు. క్రిస్ మార్వెల్ సినిమాలతో అత్యంత ప్రజాదరణ పొందాడు. ఫెంటాస్టిక్ సిరీస్‌లో కూడా కనిపించనున్నారు. ఇతని నికర విలువ 110మిలియన్‌ డాలర్లు.

ఇవి కూడా చదవండి…

వాల్తేరు వీరయ్య క్లైమాక్స్ కోసం

ధమాకా… ప్రీరిలీజ్

బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్.. గ్లింప్స్

- Advertisement -