రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలతో పలు పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ అవాంతరాల కారణంగా ఈ నెల 21 నుంచి 25 వరకు కొండ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉంటాయని పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని గిల్గిత్, బాల్టిస్థాన్, ముజఫరాబాద్, లడఖ్ ప్రాంతాల్లో వర్షం, హిమపాతం కురుస్తుందని, 24 గంటల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నెల రెండోవారం నుంచి ఉత్తరభారతంలోని మైదాన ప్రాంతాల్లో చలిగాలులు వీయలేదు. దీంతో చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఫిబ్రవరి 22న భారీగా హిమపాతం, వర్షం కురుస్తుందని చెప్పింది. అలాగే దేశ రాజధానిలో చల్లని వాతావరణం ఉంటుందని, దేశ రాజధాని ఢిల్లీని భారీగా పొగమంచు కప్పేస్తోంది.
సిక్కిం, పశ్చిమ బెంగాల్, తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లోని బీహార్, జార్ఖండ్, ఒడిశా ఛత్తీస్గఢ్, తూర్పు, ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మధ్య మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం చెప్పింది.