నైరుతి వచ్చేసింది..

259
rains
- Advertisement -

మహారాష్ట్ర నుంచి కేరళ వరకూ తీరం వెంబడి ద్రోణి, మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం వేర్వేరుగా కొనసాగుతున్నాయి. దీంతో ఇవాళ తెలంగాణలోకి, రాయలసీమ, కర్ణాటకల్లోని మిగిలిన ప్రాంతాలకూ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ ను తొలకరి పలకరించింది. అర్ధరాత్రి మొదలైన వర్షం…తెల్లవారుజాము వరకు దంచికొట్టింది. ఎల్బీనగర్, చాదర్ ఘాట్, సైదాబాద్, తార్నాక, వారాసిగూడ, ఉప్పల్, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, అమీర్ పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో పలుచోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేసింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న కొడంగల్ లో అత్యధికంగా 5 సెంటీమీటర్లు, యాచారంలో 4 సెంటీ మీటర్లు, సరూర్ నగర్ లో 3 సెంటీ మీటర్ల వర్షం పడింది. వర్షంతో మార్కెట్లలో పంట తడిసి ముద్దయ్యింది.

- Advertisement -