18 రాష్ట్రాలకు తుపాను హెచ్చరిక!

8
- Advertisement -

దేశంలోని పలు రాష్ట్రాలకు తుపాను హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఇరాక్-బంగ్లాదేశ్ కేంద్రంగా ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ సహా మరో 18 రాష్ట్రాల్లో వర్షపాతం సంభవించే అవకాశముందని తెలిపింది. మార్చి 15 వరకు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మంచు వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మార్చి 15 వరకు రాజస్థాన్‌లోనూ వర్షపాతం కొనసాగుతుందని వెల్లడించింది. తూర్పు భారతదేశంలోని బీహార్, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపురల్లో మార్చి 15 వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

దక్షిణాది రాష్ట్రాల్లోనూ వాతావరణ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళలో వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలాలని తెలిపింది.

Also Read:ఉన్మాదిలా మాట్లాడుతున్న రేవంత్: హరీష్‌ రావు

- Advertisement -