అలెర్ట్..ఎండల తీవ్రత అధికమే!

6
- Advertisement -

ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఒడిశా, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో వడగాలులు ఎక్కువగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్-జూన్ నెలల్లో పశ్చిమ ద్వీపకల్ప భారతదేశం, తూర్పు-మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

ఏప్రిల్‌లో పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య భారతదేశం మినహా మొత్తం దేశవ్యాప్తంగా రాత్రులు సాధారణం కంటే వేడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏప్రిల్‌లో తూర్పు భారతదేశంలో ప్రధానంగా ఒడిశాలో ఒక వారం వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Also Read:హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు..అప్‌డేట్

రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి నెలాఖరు వరకు ఈశాన్య రాష్ట్రాలు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని… ఇది వరదలు, కొండచరియలు విరిగిపడటానికి దారితీస్తుందని అన్నారు.

- Advertisement -