తెలంగాణలో మరో 3రోజులు భారీ వర్షాలు

67
rains
- Advertisement -

తెలంగాణలో రాగల 3రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలుచోట్ల నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్‌ నాగరత్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరో 3 రోజులు వర్షాలు ఉంటాయని తెలిపిన వాతావరణ శాఖ. దీంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం ఈ రోజు తెలంగాణ పరిసరాల్లోని విదర్భలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉందని తెలిపారు.

- Advertisement -