2022లో భారతీయ సినిమాల్లో తెలుగు సినిమాల హవా కొనసాగింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది. దీంతో 2022లో ఆర్ఆర్‌ఆర్, కేజీఎఫ్, చార్లీ777, విక్రమ్, కాంతార, రాకెట్రీ, మేజర్, సీతారామం లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల కనకవర్షం కురిపించాయి. దక్షిణాది సినిమాలను ప్రపంచానికి చాటింది. హాలీవుడ్ సినిమాలతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద పోటీపడేంత స్థాయికి ఎదిగింది.
ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్)-2022 టాప్ 10 (IMDb 2022) జాబితా తాజాగా ఈ విషయాన్ని నిరూపిస్తోంది. ఐఎండీబీ రేటింగ్‌లో కూడా దక్షిణాది సినిమాలు మరోసారి తమ రేంజ్ ఏంటో చూపించడం విశేషం. తాజాగా విడుదలైన ఐఎండీబీ టాప్ 10 లిస్టులో (ఆర్డర్ ప్రకారం) చార్లీ777, రాకెట్రీ, కాంతార, సీతారామం, విక్రమ్, కేజీఎఫ్2, ది కాశ్మీర్ ఫైల్స్, మేజర్, ఆర్ఆర్ఆర్, పొన్నియన్ సెల్వన్ వరుసగా నిలిచాయి.
From the magic of RRR to the charm of 777 Charlie, here are the #IMDbBestof2022 Top 10 Most Popular Indian Movies of the year 💛 https://t.co/IAv7hXqGeA
— IMDb (@IMDb) December 14, 2022
ఐఎండీబీ జాబితా ప్రకారం మూడు తెలుగు సినిమాలు, మూడు తమిళ సినిమాలు, మూడు కన్నడ సినిమాలు కాగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ది కశ్మీర్ ఫైల్స్ ఒక్కటే చోటు దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి…