సెకండ్ వేవ్…513 మంది డాక్టర్లు మృతి

38
doctors

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతికి 513 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. అత్యధికంగా ఢిల్లీలో 103 మంది డాక్టర్లు చనిపోయారని తెలిపిన ఐఎంఏ…తెలంగాణలో 29 మంది డాక్టర్లు మృతిచెందారని తెలిపారు.

గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,96,427 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3,511 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు వదిలారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,69,48,874కు చేరగా 2,40,54,861 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,07,231 మంది వైరస్‌ బారినపడి మృతి చెందారు.