కరుణానిధిపై పుస్తకం రాశా: ప్రకాశ్‌రాజ్‌

270
- Advertisement -

ప్రకాశ్‌రాజ్‌..దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. విలక్షణ నటుడిగా పేరు సంపాధించుకోవడమే కాకుండా..ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా కూడా అందరి నాలుకల్లో నానాడు ప్రకాశ్‌ రాజ్. ఇన్నాళ్ళూ నటుడిగా వెండతెరమీద కనిపించిన ప్రకాశ్‌..ఇప్పుడు కలం పట్టి రచయితగా మారాడు.

ద్రవిడ ఉద్యమనేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై ఓ పుస్తకాన్ని కూడా రాశారు ప్రకాశ్‌ రాజ్. రీసెంట్‌గా ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

Actor Prakash rajప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ…‘ఈ పుస్తకం గురించి ఇప్పుడే ఏమీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఆయన గురించి తెలిసినంత వరకు కన్నడ వెర్షన్‌లో పుస్తకం రాశాను. ప్రముఖ  దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్‌’ చిత్రంలో నేను ఆయన పాత్ర పోషించాను. అందరు చూసే కోణంలో కాకుండా నేను ఆయనను వేరే విధంగా చూశాను. ఆయనపై
పుస్తకం రాయాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. ఇన్నాళ్లకు అది నెరవేరింది. ఇప్పటికే కన్నడ వెర్షన్‌లో ఈ పుస్తకాన్ని రాయడం పూర్తయింది. ఇక తమిళ వెర్షన్‌లో రాయడం ప్రారంభించాను’ అని తెలిపారు. ప్రకాశ్‌ రాజ్‌ ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

- Advertisement -