ఎన్టీఆర్ చిత్రంలో నటించటం లేదు..

374
Im not playing Jayalalithaa Charector in NTR biopic-Kajal Aggarwal
- Advertisement -

తేజ దర్శకత్వంలో మహానటుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో తనయుడు బాలకృష్ణ పోషిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‎తో ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన జయలలిత పాత్రను కూడా ఈ చిత్రంలో చూపించనున్నారట. అందుకుగాను హీరోయిన్ కాజల్‎ని జయలలిత పాత్ర కోసం తేజ సంప్రదించారని టాక్ వినిపించింది.

 Im not playing Jayalalithaa Charector in NTR biopic-Kajal Aggarwal

అయితే తాజాగా దీనిపై నటి కాజల్ స్పందించింది. ఈ సినిమా కోసం నన్ను ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదని, ఇది కేవలం పుకారు మాత్రమేనని ఈ చిత్రంలో నేను నటించడం లేదంటూ స్పష్టం చేసింది. కాజల్ నటించడం లేదని చెప్పడంతో మరీ జయలలిత పాత్ర ఎవరికి దక్కుతుందో అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.

మరోవైపు బసవతారకం పాత్రకి విద్యాబాలన్‎ని సంప్రదించారని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కోసం మహేష్‎ని సంప్రదించగా మహేష్ ఆనందంగా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ తనను సంప్రదిస్తే తాతగారి బయోపిక్‎లో నటించేందుకు సిద్దంగా ఉన్నానని జూ.ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

- Advertisement -