నేను మనిషిని..మోడీని కాదు:రాహుల్‌

159
I'm Human not Modi says Rahul
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై రాహుల్ కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో స్వరం పెంచిన రాహుల్‌..మోడీ సర్కార్‌ను తూర్పారబట్టారు.  అయితే, రాహుల్‌ ప్రశ్న వేయడం వరకు బాగానే ఉంది కానీ అందులో చిన్న పొరపాటు జరిగింది.

దీంతో తప్పును సరిదిద్దుకున్న రాహుల్‌…బీజేపీ విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఒక్క పదంతోనే మోడీ, బీజేపీకి చురకలంటించారు. నేను ఓ సాధారణ మనిషిని…నరేంద్రమోడీని కాదన్నారు.మనుషులన్నాక ఇలాంటి తప్పులు చేయడం సహజం.. నా తప్పులు గుర్తించేలా చేసినందుకు థ్యాంక్స్ అంటూ  ట్వీట్ చేశారు.

rahul-gandhi-pti_650x400_51512546844
మోడీ ప్రభుత్వం వచ్చాక ధరల పెరుగుదలపై ట్వీట్ చేశారు.  అయితే ధరల పెరుగుదల శాతాల్లో ఘోరమైన తప్పిదాలు చేశారు. దీంతో నీకు కనీసం లెక్కలు కూడా రావా అంటూ నెటిజన్లు ఆయనతో ఆడుకున్నారు. తప్పును గుర్తించిన ఆయన.. ఆ ట్వీట్‌ను డిలిట్ చేసి మరో ట్వీట్ వేస్తూ ఒక్కలైన్‌లోనే మోడీ,బీజేపీ నేతలను మాట్లాడనివ్వకుండా చేశారు.

- Advertisement -