అవును..మీరు చదివింది నిజమే. నిరవ్ మోదీని చెప్పుతో కొడతానంటోంది ఓ మహిళ. ఆమె పేరు సుజాత పాటిల్. తన భర్తని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆవేధన వ్యక్తం చేస్తోంది. నీరవ్ మోదీ సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ పాటిల్ భార్య సుజాత పాటిల్.
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)లో రూ.11,400కోట్ల భారీ మోసంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ సంస్థలకు చెందిన ఉద్యోగులను వరుసగా ఒక్కొక్కరిని దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అర్జున్ పాటిల్ అరెస్టయ్యాడు. దీంతో..భార్య సుజాత పాటిల్.. నీరవ్ మోదీ పై దుమ్మెత్తిపోస్తోంది. నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ గ్రూప్‌లో తన మిగతా ఉద్యోగుల మాదిరిగానే తన భర్త కూడా డాక్యుమెంట్లను తయారు చేస్తూ..10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని తెలిపింది. ఈ మోసాలన్నింటికీ నీరవ్ మోదీనే బాధ్యుడని, అతన్ని తన దగ్గరికి తీసుకొస్తే చెప్పుతో కొడతానంటూ సుజాత పేర్కొంది.
అయితే..ఈ భారీ కుంభకోణానికి సంబంధించి నమోదైన తొలి ఎఫ్‌ఐఆర్‌లో అర్జున్ పాటిల్‌తో పాటు మరికొంతమందిని సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రుణాలు పొందడానికి కావాల్సిన నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్(ఎల్‌వోయూ) దరఖాస్తులను అర్జున్ తయారు చేసేవాడని పేర్కొంది. దీనిలో భాగంగా అతన్ని 12 రోజుల పాటు సీబీఐ తన కస్టడీలోకి తీసుకొంది.
కాగా..తన భర్త సంస్థలో ఓ సాధారణ ఉద్యోగి మాత్రమేనని కేవలం అతడు నెలకు రూ.30వేల జీతాన్ని మాత్రమే పొందేవాడని ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదని.. ఈ మోసంలో తన భర్త పాత్రేం లేదని సుజాత పాటిల్ కన్నీటి పర్యంతమైంది.
Mere pati 10 saal se kaam kar rahe hain wahan, kuch logon ki tarah woh bhi paperwork karte the. Nirav Modi inn sab ke liye zimmevar hai, usko mere saamne lao woh ayega toh main usse chappal se maarungi: Sujata Patil, Wife of accused Arjun Patil. #PNBFraudCase pic.twitter.com/C4XDKOCj4X
— ANI (@ANI) February 21, 2018