- Advertisement -
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ చాలా కష్టపడుతున్నారన్నారు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. దేశంలోని ప్రాంతియ పార్టీలన్నింటిని ఏకం చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. హైదరాబాద్ వచ్చి త్వరలోనే సీఎం కేసీఆర్ ను కలుస్తానని చెప్పారు. దేశంలో గుణాత్మక మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ లక్ష్యంగా దేశ వ్యాప్త పర్యటనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారు.
- Advertisement -