తల్లి కాబోతున్న ఇలియానా..!

28
- Advertisement -

దేవదాస్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి తీగ నడుముతో ఎంతోమంది యువకుల హృదయాలని దోచేసిన ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ దశాబ్దం పాటు కొనసాగింది. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. కొంతకాలంగా సినిమాలకు దూరమైన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ ఎంటర్‌టైన్ చేస్తోంది.

బాలీవుడ్ లో నిలబడాలంటే అందాలను ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఫాలో అవుతోంది సుందరి. ఇక అక్కడికి వెళ్లాకే ఇలియానా అన్నీ అందాలను చూసే భాగ్యం అభిమానులకు దొరికిందట. ఇక తాజాగా ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అందించింది.

తన ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది. రెండు ఫోటోలను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. త్వరలో.. నిన్ను కలవడానికి ఎదరుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్ అని తెలపగా ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -