హాట్ బ్యూటీ ఇలియానాకు తన బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే కాలు నేలమిద నిలవడంలేదు. కొంతకాలంగా ఇలియానా ఫోటో షూట్లతో రెచ్చిపోతు,,కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న విషయం తెలిసందే. అయితే ఆ ఫొటోలు అంత అందంగా, సెక్సీగా రావడానిక కారణం అమ్మడు భాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోస్ నట. అతడు ప్రముఖ ఫోటోగ్రఫర్ కావడంతో,,తనను ఫోటోల ద్వారా ఇంకాస్త అందంగా చూపిస్తున్నాడని భాయ్ ఫ్రెండ్‌ను తెగ పొగిడేస్తోంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో లవర్ గురించి గొప్పలు చెబుతూ,,హిందీ జనాల ముందు అడ్డంగా బుక్కైంది.
ఆండ్రూ నీబోస్ కి మీరు సినిమాలన్నీ చూపించారా? అని ఆమెను ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి ఇలియానా నేను నటించిన సినిమాలన్నీ ఆండ్రూకి చూపించను. అందులో కొన్ని మంచి సినిమాలు మాత్రమే చూపించాను అంటూ చెప్పిందట. అసలు బాలీవుడ్ లో ఇలియానా చేసిందే రెండు మూడు సినిమాలు. అందులో ప్రియుడికి చూపించిన సినిమాలు ఎన్ని? చూపించని సినిమాలు ఎన్ని?అంటూ బాలీవుడ్ జనాలు ఇప్పుడు ఇలియానాపై సెటైర్లు వేస్తున్నారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈ చిట్టినడుము చిన్నది ఇలియానా,, రన్ బీర్ కపూర్ బర్ఫి సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ సూపర్‌గా ఉండడంతో,,అక్కడ కూడా బాగానే ఫేం సంపాదించుకుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు పరిచయమైన ఈ గోవా బ్యూటీకి బీటౌన్ నిళ్లు త్వరగానే వంట పట్టాయి. తోటి హీరోయిన్లకు భాయ్ ప్రెండ్స్ ఉండి నాకు లేకపోతే ఎట్లా అనుకుందో ఏమో,,వెంటనే లవ్ పాట్నర్‌ను వెతుక్కుంది.
మొదట యంగ్ హీరో వరుణ్ దావన్ తో ప్రేమయాణం నడిపించింది. కొన్ని రోజులు వరకు పార్టీలు, మీటింగ్, డేటింగ్లు అంటూ బాగానే తిరిగారు. తరువాత ఏమైందో ఏమో బ్రేక ప్ అంటూ,,వరుణ్‌కు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత ఆస్ట్ర్రేలియా ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోస్‌తో ప్రేమలో పడింది. ప్రస్తుతం అతని ప్రేమలోనే షికారు చేస్తోంది. మరి ఇతనితోనా ఏడు అడుగులు నడుస్తుందా లేక,,మధ్యలోనే హ్యాండ్ ఇస్తుందోనని బాలీవుడ్ జనాలు చేవులు కొరుక్కుంటున్నారు. హిట్లు లేక కొంతకాలం నుంచి బోసిపోయిన అమ్మడుకు అక్షయ్ కుమార్ రుస్తుం సినిమాతో మళ్లీ గాడిలో పడినట్టైంది.