గర్బవతినని ప్రచారం చేశారు…!

253
ileana
- Advertisement -

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా. తర్వాత బాలీవుడ్లో అడుగు పెట్టి తాజాగా రవితేజతో అమర్ అక్బర్ అంటోనీ మూవీతో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 16న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఇలియానా.

తెలుగులో నటించడం, హైదరాబాద్‌లో ఉండటం చాలా ఇష్టమని తెలిపింది ఇల్లీ బేబి. మంచి కథ కోసమే ఇంతవరకు ఎదురుచూశానని శ్రీను వైట్ల చెప్పిన స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పానని తెలిపారు. నా కెరీర్‌లో ఇలాంటి పాత్రని చేయడం ఇదే తొలిసారి. నటించడానికి మంచి అవకాశం లభించిందన్నారు. రవితేజ మంచి స్నేహితుడని… ఆయనతో కలిసి నటించడం ఎప్పుడూ సరదాగా ఉంటుందన్నారు.

తాను గర్భవతినని ప్రాచరం చేశారని అలాంటి వార్తలు విన్నప్పుడు నవ్వొస్తుందన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారో అర్ధం కాలేదని.. పెళ్లి, నిశ్చితార్థం, బంధం… ఇలాంటి విషయాల గురించి మాట్లాడే ఉద్దేశం లేదని తెలిపింది. ఆండ్రూ నీబోన్‌తో సంతోషంగా ఉన్నానని చెప్పింది. మీ టూ ఉద్యమం వల్ల చాలాచోట్ల కమిటీల్ని ఏర్పాటు చేసి మహిళలకి రక్షణగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పరిణామం అనితెలిపింది ఇలియానా.

- Advertisement -