మీటూ..టాలీవుడ్ సేఫ్:అల్లు అర్జున్

422
allu arjun
- Advertisement -

హాలీవుడ్,బాలీవుడ్ ఇండస్ట్రిలతో పోలీస్తే అమ్మాయిలకు టాలీవుడ్ సేఫ్ జోన్ అన్నారు అల్లు అర్జున్. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా మూవీ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అల్లు అర్జున్ మీటూ లాంటి ఉద్యమాలు చూసినప్పుడు అనిపిస్తుంది…అన్ని చిత్ర పరిశ్రమల్లోకల్లా తెలుగు పరిశ్రమ చాలా క్లీన్ అని బన్నీ తెలిపాడు. ఇక్కడ అమ్మాయిలకు చాలా గౌరవం ఉంటుంది. ధైర్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీకి రావచ్చు అని తెలిపారు.

సినిమా అంటే తమకు లైఫ్ అని, ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాయని, దయ చేసి పైరసీని ఆరికట్టాలని కోరారు. విజయ్ దేవరకొండ చాలా మంచి నటుడని, మంచి మంచి సినిమా కథలు ఎంచుకుంటాడని తెలిపారు.

విజయ్ చాలా కష్టపడి సినిమాల్లోకి వచ్చారని… ఏదో అలా క్రేజ్ వచ్చిందని చిన్న చూపు చూడటం సరికాదన్నారు. హిట్లు, ఫ్లాపులు సహజం. నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. దాని గురించి పట్టించుకోవద్దన్నారు. తనకు తానుగా చెక్కుకున్న శిల్పం విజయ్. సెల్ఫ్‌మేడ్ పీపుల్ అంటే నాకు చాలా గౌరవం. విజయ్ దగ్గర ఒరిజినాలిటీ ఉందన్నారు.

- Advertisement -