నా పాటలకు మీకు డబ్బులా..!

263
ilayaraja music
- Advertisement -

ఇళయరాజా పేరు వినని సంగీత ప్రియులు, సినిమా అభిమానులు ఉండరు. ఐదు దశాబ్దాలుగా వందలాది చిత్రాలకు ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికీ పలు సినీ కార్యక్రమాల్లో ఆయన పాటలు వినిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఇకపై తన అనుమతి లేకుండా పాటలు పాడటానికి వీలు లేదు అంటున్నారు ఇళయరాజా. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసిన మ్యూజిక్ మ్యాస్ట్రో తన అనుమతి లేకుండా పాడటం సబబు కాదని అభిప్రాయపడ్డారు.

మీరంతా పాటలు పాడటానికి డబ్బులు తీసుకుంటారు..? మరి నా పాటలు పాడుతూ మీరు డబ్బులు తీసుకోవడం సరైనదేనా? నాకూ వాటా రావాల్సిన పనిలేదా? అని ప్రశ్నించారు. తాను అడుగుతుంది కొంత నగదు మాత్రమేనని ఈ డబ్బు ముందు తరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

తాను ఐపీఆర్‌ఎస్‌(ఇండియన్‌ పెర్ఫార్మింగ్‌ రైట్స్‌ సొసైటీ)లో సభ్యుడిని కానని… అయినప్పటికీ నా పాటలు పాడుతున్నందుకు రావాల్సిన రాయల్టీ ఫీజ్‌ను ఐపీఆర్‌ఎస్‌ సేకరిస్తోంది. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదని… ఆ ఫీజు దక్షిణ సినిమా సంగీత కళాకారుల సంఘం సేకరిస్తుందన్నారు. ఇకపై సింగర్స్ కూడా నా అనుమతి లేకుండా నా పాటలు పాడితే మ్యుజీషియన్స్‌తో పాటు బ్యాండ్‌ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

- Advertisement -