ఇవి చేస్తే జిమ్ కు వెళ్లకుండానే..ఫుల్ ఫిట్!

46
- Advertisement -

చాలా మంది హెవీ వెయిట్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వేలకు వేలు ఖర్చు చేసి మెడిసిన్స్.. గంటల తరబడి జిమ్ లో కసరత్తులు ఇలా చేయని ప్రయత్నాలంటూ ఉండవు. అయితే ఇలా మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం, మితిమీరిన కసరత్తులు చేయడం వల్ల.. ఫేస్ లో మార్పులు చోటు చేసుకుంటూ చర్మం పాలిపోయి కనిపిస్తుంది. అందుకే హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు తీవ్రమైన వర్కౌట్ చేసేందుకు సంకోచిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారికి వ్యాయామంలోని కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా చాలా ఈజీగా వెయిట్ లాస్ పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం !

పుష్ అప్స్ గురించి మనందరికి తెలిసే ఉంటుంది. శరీరంలోని కొవ్వును వేగంగా తగ్గించే ఒక వ్యాయామంగా చెప్పుకోవచ్చు. పుష్ అప్స్ ఎక్కువగా చేయడం వల్ల ఛాతీ, భుజాలు, పొత్తి కడుపు కండరాలు, ఎంతో దృఢంగా తయారవుతాయి. అంతే కాకుండా పిరుదుల భాగంలో పెరుకుపోయిన కొవ్వు కూడా త్వరగా కరిగిపోతుంది. రోజుకు 30-50 పుష్ అప్స్ చేయడం ద్వారా జిమ్ కు వెళ్లాల్సిన పని లేకుండా ఆకర్షణీయమైన శరీరకృతి సొంతం అవుతుంది.

ఫ్రాగ్ జంప్.. ఈ వ్యాయామం కాళ్ళ యొక్క పటుత్వాన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఇది ఎలా చేయాలంటే ముందుగా పాదాలను నేలపై పూర్తిగా ఆనించాలి. ఆ తరువాత స్క్వాట్స్ పొజిషన్ లోకి వచ్చి, అరమీటర్ వరకు జంప్ చేస్తూ ముందుకు సాగాలి. ఇలా ఫ్రాగ్ జంప్ చేయడం వల్ల కాళ్ళ భాగంలోని కండరాలు దృఢంగా తయారవుతాయి. ఇంకా శ్వాస ను అదుపు చేస్తే శక్తి కూడా పెరుగుతుంది. రోజుకు కనీసం 70 నుంచి 80 ఫ్రాగ్ జంప్ లను చేస్తే శరీరం ఫిట్ గా తయారవుతుందట.

స్క్వాట్ జంప్.. ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అన్నీ భాగాలపై పెరుకుపోయిన కొవ్వు త్వరగా కలిగిపోతుంది. అలాగే ఉదర భాగంలోని కండరాలు శక్తినొందుతాయి మడిమలు, తొడలు, పిరుదులు, ఇలా కాళ్ళకు సంబంధించిన అన్నీ భాగాలు అత్యంత పటిష్టంగా తయారవుతాయి. కాబట్టి రోజుకు కనీసం 15 నుంచి 20 నిముషాల పాటు స్క్వాట్ జంప్ చేస్తే ఎంతో మంచిదట.

Also Read: బత్తాయి రసంతో ఆ సమస్యలు దూరం.. !

ఇంకా వీటితోపాటు పుల్ అప్స్, ఆఫ్ కొడ్స్.. వంటి వ్యాయామాలు మన డైలీ కసరత్తులో చేర్చుకుంటే జిమ్ కు వెళ్లకుండానే చక్కటి ఆకర్షణీయమైన శరీరకృతితో పాటు, బాడీ ని ఫిట్ గా ఉంచుకోవచ్చు.

Also Read: గంజి తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలో.. !

- Advertisement -