సి‌ఎం పదవి ఇవ్వకపోతే.. డీకే రాజీనామా ?

58
- Advertisement -

కర్నాటక కాంగ్రెస్ లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి ఎంపికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సి‌ఎం రేస్ లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య రేస్ లో ఉన్నారు. వీరిద్దరిలో మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మేల్యేలు సిద్దరామయ్య వైపే మొగ్గు చూపుతుండడంతో డీకే శివకుమార్ తిరుగుబాటు బావుట ఎగురవేశారు. పార్టీ విజయంలో తనదే కీలక పాత్ర అని 135 ఎమ్మెల్యేలను తానే గెలిపించుకున్నని అందువల్ల సి‌ఎం‌ పదవికి తానే అర్హుడను అని డీకే శివకుమార్ అసంతృప్తి గళం వినిపించడంతో ఈ వ్యవహారం కష్టం డిల్లీకి చేరుకుంది.

Also Read: హస్తినకు కర్ణాటక పాలిటిక్స్

ప్రస్తుతం డిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి పార్టీ పెద్దలు ఎవరు ముఖ్యమంత్రి అనే దానిపై తేల్చేందుకు తర్జన భర్జన పడుతున్నారు. అయితే అధిష్టానం కూడా సిద్దరామయ్య వైపే చూస్తుందనే వార్తలు రావడంతో.. డీకే శివకుమార్ తదుపరి ఏం చేయబోతున్నారు.? పార్టీని విడతరా ? లేదా పార్టీలో చీలిక తీసుకొస్తారా ? ఇలాంటి వార్తలు నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారాయి. దాంతో ఈ వార్తలపై డీకే శివకుమార్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ” తాను పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తనకు తల్లిలాంటిదని చెప్పుకొచ్చారాయన. తాను సి‌ఎం పదవికి అర్హుడనని చెబుతూనే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు డీకే శివకుమార్. కాగా ఈ నెల 18 న సి‌ఎం ప్రమాణ స్వీకారం ఉండడంతో సి‌ఎం ఎవరనేది ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరీ కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని సి‌ఎం గా నియమిస్తుందో చూడాలి.

Also Read: ఆత్మనిర్భర్‌ భారత్..2,736 దేశీయ రక్షణ ఉత్పత్తులు

- Advertisement -