ఇందిరమ్మ రాజ్యమంటే.. అదే విపత్తు!

37
- Advertisement -

ఈ మద్య తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి కబుర్లు చెబుతూ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఆరు గ్యారెంటీలు అని, ఇందిరమ్మ రాజ్యం అని ఇలా ఏవేవో చెబుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆరు గ్యారెంటీలు పేరుతో ఇచ్చిన హామీలను కర్నాటకలో చేతులెత్తేసిన పరిస్థితి. ఇక్కడ కూడా అవే హామీలను ప్రకటించి పబ్బం గడుపుకునేందుకు హస్తం పార్టీ తెగ ప్రయత్నిస్తోంది. ఇక ప్రజల్లో సెంటిమెంట్ ను రగిల్చేలా ఈ మధ్య పదే పదే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ చెబుతున్నారు హస్తం నేతలు. నిజానికి ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైమ్ లో దేశంలో నెలకొన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పడ్డ ఎమర్జెన్సీ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని విపత్తు.

ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు నక్సలిజం, ఆకలి కేకలు, నిరుద్యోగం.. ఇలా దేశాన్ని పట్టిపీడించిన సమస్యలెన్నో.. మరి తాము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతున్నా కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఆనాటి సమస్యల్లోకి రాష్ట్రాన్ని నెట్టేందుకు పరోక్షంగా హింట్ ఇస్తున్నారా అనే అనుమానాలు రాక మానవు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 11 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో సాగించిన దోపిడీ నిరంకుశ పాలన.. నిద్రలో కూడా ప్రజలు మర్చిపోలేని దుస్థితి. అలాంటి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పడేలా ఎన్టీ రామారావు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి కాంగ్రెస్ పార్టీని పాతాళానికి నెట్టేసిన సంగతి విధితమే. మరి అంతటి దౌర్భాగ్య పార్టీకి ప్రజలు తిరిగి అధికారం కట్టబెట్టే అవకాశం ముమ్మాటికి లేదనేది అందరికీ తెలిసిన విషయం. తాము అధికారంలోకి వస్తే ముమ్మాటికి తిప్పలు తప్పవని పరోక్షంగా ఆ పార్టీ నేతలే ” ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతుండడం గమనార్హం.

Also Read:హాట్ బ్యూటీ లేటెస్ట్ ముచ్చట్లు

- Advertisement -