యంగ్ హీరో సుశాంత్ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో చేసిన పాత్రతో ఇటు విమర్శకుల, అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. దాని తర్వాత ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్. దర్శన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో సోమవారం పునఃప్రారంభమైంది. ప్రస్తుతం హీరో హీరోయిన్లు సుశాంత్, మీనాక్షి చౌధరి లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ పాటను శ్రీనివాసమౌళి రచించారు. కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.
సెప్టెంబర్ 20 నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందని చిత్ర బృందం తెలిపింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్‌ను స్టార్ట్ చేస్తున్న సుశాంత్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. గేర్ మార్చి బండి తియ్ అనే క్యాప్షన్ ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. అంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్ర బృందం తెలియజేసింది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎం. సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
సుశాంత్, మీనాక్షి చౌధరి, వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస, కృష్ణచైతన్య
సాంకేతిక బృందం:
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
సంభాషణలు: సురేష్ భాస్కర్
ఆర్ట్: వి.వి.
పీఆర్వో: వంశీ-శేఖర్
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల
దర్శకత్వం: ఎస్. దర్శన్
బ్యానర్స్: ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్