సెమీస్ కు వర్షం ఆటంకం…నేడు మిగతా మ్యాచ్

315
rain-will-effect-first-semifinal
- Advertisement -

ప్రపంచకప్ లో భాగంగా మాంచెస్టెర్ వేదికగా నిన్న తొలి సెమి ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ ఇండియా మధ్య జరగిన సంగతి తెలిసిందే. అయితే మొదటి ఇన్నింగ్స్ చివర్లో వర్షం కురువడంతో మ్యాచ్ ను ఇవాళ్టీకి వాయిదా వేసారు. సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లకు రిజర్వ్ డేను ఏర్పాటు చేశారు. న్యూజిలాండ్ జట్టు 46.1 ఓవర్ల నుంచి బ్యాటింగ్ కొనసాగించాల్సి ఉంటుంది. మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (67), టామ్ లాథమ్ (3) ఉన్నారు.

వర్షం తగ్గిన తర్వాత పూర్తిస్థాయి ఓవర్లు ఆడే పరిస్థితి లేకపోతే కనీసం 20 ఓవర్లు అయినా ఆడించే వెసులుబాటు ఉంది. 20 ఓవర్లకు కూడా అవకాశం లేకపోతే రిజర్వ్‌ డే అయిన బుధవారం తిరిగి మ్యాచ్‌ జరుగుతుంది. భారత బౌలర్లు పాండ్యా, బుమ్రా, చాహల్, భువనేశ్వర్ , జడేజలకు ఒక్కో వికెట్ ను తీశారు. అయితే ఇవాళ కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితి లేకపోతే అప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నందున టీమిండియానే నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.

- Advertisement -